fbpx

Media Articles

ప్రజాభాగస్వామ్యం కోసం సానా సతీష్ బాబు నిర్ణయం

Sana Sathish Babu Mana Kakinada Jilla Kosam

ప్రజాభాగస్వామ్యంతోనే మన కాకినాడ జిల్లా అభివృద్ధి సాకారమవుతుందనే భావనతో ప్రముఖ వ్యాపార దిగ్గజం, సామాజికవేత్త సానా సతీష్ బాబు మన కాకినాడ జిల్లా కోసం అనే మహత్తర కార్యక్రమానికి బీజం వేశారు. తద్వారా కాకినాడ జిల్లాలోని ప్రజలందరినీ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు చేసేందుకు ఆహ్వానిస్తున్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం ద్వారా కాకినాడను అన్ని రంగాల్లో నెంబర్ వన్ చేసేందుకు ప్రజల నుంచి సలహాలు, సూచనలను స్వీకరిస్తున్నారు. తద్వారా ప్రజల ఆలోచనలను ఒక్కచోటకు చేర్చి వాటిని ఆచరణలోకి తీసుకు రావాలనే గొప్ప సంకల్పంతో సానా సతీష్ బాబు మన కాకినాడ జిల్లా కోసం కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు.

ఎందుకంటే కాకినాడ జిల్లాలో సముద్రంలోని సంపదతో పాటు సహజ వనరులు కూడా పుష్కలంగా ఉన్నాయి. వ్యాపార, వాణిజ్య, నివాసానికి అనుగుణమైన ప్రాంతంగా మన కాకినాడ జిల్లా పేరొందింది. పెన్షర్స్ ప్యారడైజ్ గా పిలవడే మన కాకినాడ జిల్లా అభివృద్ధికి అన్ని విధాల అవకాశాలున్నాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకొని కాకినాడ జిల్లా ప్రజల జీవితాలను మార్చుకోవడమనే బాధ్యత కాకినాడవాసులైన ప్రతిఒక్కరిపైన ఉంది. తద్వారా నాణ్యమైన విద్యా, వైద్యంతో పాటు నైపుణ్య శిక్షణ కేంద్రాలు, పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించవచ్చు. రైతులకు నీటి వనరులను ఒడిసిపట్టి సాగునీటిని అందించవచ్చు. మత్స్యకారుల జీవనాధారాన్ని పరిరక్షించవచ్చు. బడుగు, బలహీన వర్గాల సాధికారతను సాధించవచ్చు. అందుకే మన కాకినాడ జిల్లా కోసం కార్యక్రమంలో జిల్లవాసులంతా భాగస్వాములను చేస్తూ, వారి గళాన్ని వినిపించేందుకు సన్నద్ధమవుతున్నారు మన సానా సతీష్ బాబు.

ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు 8297299399 నెంబరుకు వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వగలరు.